: జూనియర్ ఎన్టీఆర్ తో ‘గుండమ్మకథ’ లాంటి సినిమా తీయాలని ఉంది: దర్శకురాలు నందినిరెడ్డి
‘అలా మొదలైంది’, ‘జబర్దస్త్’, ‘కల్యాణ వైభోగమే’ సినిమాలను తెరకెక్కించిన దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి తాజాగా తన అభిమానులకు చేరువగా ఉండే నిమిత్తం ఓ వెబ్ సైట్ లింక్ ను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘మేడమ్, జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ ఎప్పుడు చేస్తారు? కోంబో లవ్ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాను’ అని ఆ అభిమాని ప్రశ్నించగా, నందినిరెడ్డి సమాధానమిస్తూ..‘ అతనితో ‘గుండమ్మకథ’ లాంటి సినిమా చేయాలని ఉంది... ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు’ అని అన్నారు.