: నంద్యాల ఉపఎన్నికల్లో గెలుపు టీడీపీదే: లగడపాటి రాజగోపాల్


నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని సీనియర్ రాజకీయవేత్త లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, భారీ పోలింగ్ గెలుపోటములను మారుస్తుందనే ప్రచారం సరికాదని, మంచి మెజార్టీతో టీడీపీ గెలుస్తుందని అన్నారు. కాగా, నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 28 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు మధ్యాహ్నంకి ఎన్నికల ఫలితం వెల్లడిస్తామని ఎలక్షన్ చీఫ్ భన్వర్ లాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News