murugadoos: రజనీకాంత్ కోసం కథ రెడీ .. ఆయనదే ఆలస్యం : మురుగదాస్

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమా చేయడానికి ఈ మూడు భాషల్లోని అగ్రకథానాయకులు ఆసక్తిని చూపుతుంటారు. అలాంటి మురుగ దాస్ . . రజనీకాంత్ కోసం కథ రెడీ చేసినట్టు చెప్పాడు. రజనీకాంత్ తో కలిసి పనిచేయాలనే కోరిక తనకి చాలా కాలంగా ఉందనీ, అందువలన కథ రెడీ చేసి పెట్టుకున్నానని అన్నాడు.  రజనీ కాంత్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా వున్నానని చెప్పాడు.

 తనతో సినిమాలు చేసిన అమీర్ ఖాన్ .. అక్షయ్ కుమార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా కథ రెడీ చేసుకుని వచ్చేయమని అంటూ ఉంటారనీ, తనకి మాత్రం ముందుగా రజనీతో సినిమా చేయాలనే ముచ్చట తీర్చుకోవాలని ఉందని చెప్పుకొచ్చాడు. మురుగదాస్ కి ఆ ఛాన్స్ ఎప్పుడు తగులుతుందో చూడాలి మరి.     
murugadoos

More Telugu News