: చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తనే పడతారు: అంబటి
నంద్యాలలో ఉప ఎన్నికల సరళి అద్భుతంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాలలో ఓట్ల శాతం ఇంతగా నమోదు కావడం ప్రజాస్వామ్యానికి మంచి చిహ్నమని అన్నారు. నంద్యాలలో ప్రజలు న్యాయానికి, ధర్మానికే ఓటు వేస్తారని పేర్కొన్నారు. నంద్యాలలో నోటిఫికేషన్ రాకముందే అక్కడ అభివృద్ధి పనులంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారని అన్నారు. పింఛన్ తీసుకోవాలంటే టీడీపీకి ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు బెదిరించారని వ్యాఖ్యానించారు. జగన్ మాత్రం నంద్యాలలో అటువంటి ప్రచారం చేసుకోలేదని, చంద్రబాబు పాలనను ఎండగట్టారని తెలిపారు. చంద్రబాబు తాను తీసుకున్న గోతిలో తనే పడతారని అన్నారు.