: అమ్మపై ఒట్టేసి చెబుతున్నా... వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్


క్రికెట్ బెట్టింగులతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అమ్మపై ఒట్టేసి ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. తనకు సంబంధం లేకపోయినా... విచారణ కోసం పోలీసులు రమ్మంటే వచ్చానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు నమ్మితే చాలని అన్నారు.

బెట్టింగ్ వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలను ఇరికించడం దారుణమని... ఈ అంశంతో టీడీపీ నేతలకు సంబంధాలున్నా, వారికి నోటీసులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన బుకీ కృష్ణసింగ్ కాల్ డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన బుకీలంతా టీడీపీ నేతలే అని ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చి రూ. 30 కోట్ల విలువైన ఆస్తులను పోగొట్టుకున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News