udayabhanu: ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్న ఉదయభాను దంపతులు!

బుల్లితెరపై యాంకర్ గా ఉదయభాను చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు సినిమా హీరోయిన్స్ కి ఉండేంత క్రేజ్ ఆమెకి ఉండేది. తన గ్లామర్ తోను .. చలాకీ మాటలతోను ఉదయభాను యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ను ఉత్సాహంగా నడిపించడంలోను ఆమె తన ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది.

అలాంటి ఉదయభాను ఒకేసారి ఇద్దరు పాపలకు జన్మనిచ్చింది. ఆ కవల పిల్లల తొలి పుట్టిన రోజు వేడుకను బంజారా హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో ఉదయభాను దంపతులు గ్రాండ్ గా నిర్వహించనున్నట్టు సమాచారం. టీవీ .. సినీ రంగాలకి సంబంధించిన సన్నిహితులను ఆమె ఈ వేడుకకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ తేదీన ఈ వేడుకను జరపనున్నట్టు చెబుతున్నారు.     
udayabhanu

More Telugu News