: షూటింగ్ అంటూ కొత్త రకం చీకటి దందా... జూదం, అమ్మాయిల సేవలు... తాట తీసిన పోలీసులు!


పైకి చూస్తే అక్కడో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు ఉంటుంది. జరుగుతున్నట్టేమిటి... అప్పుడప్పుటూ షూటింగ్ లు జరుగుతూ ఉంటాయి కూడా. కానీ అక్కడ జరిగేది గుట్టు చప్పుడు కాని క్యాసినో. లగ్జరీ కార్లలో తప్ప అక్కడికి సాధారణ పౌరులు చేరలేరు. ఇక్కడ అమ్మాయిల సేవలు కూడా అందుతాయి. లిక్కర్, హుక్కాలతో పాటు జూదం ఆడేందుకు అవసరమయ్యే కాయిన్స్ ఇక్కడ కోకొల్లలు. వాస్తవానికి సినిమా షూటింగ్ అంటే, డమ్మీ మద్యం మాత్రమే వాడుతారు. కానీ, ఇక్కడ అదే పేరుతో వాస్తవ జూదమే సాగుతుంది.

ఈ చీకటి దందాను తాజాగా పోలీసులు బట్టబయలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని డేరామండీ ప్రాంతంలో ఉన్న 13 ఎకరాల లగ్జరీ ఫామ్ హౌస్ అది. అక్కడో క్యాసినో బార్ ఉంది. షూటింగ్ లు జరుగుతున్నట్టు చెప్పుకుంటూ వాస్తవ క్యాసినోనే ఇక్కడ రన్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేయగా, జూదం ఆడుతున్న 14 మంది, ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. 13 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. లక్షల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ కూడా లభించాయి. ఇండియాలో క్యాసినోలకు గోవా, సిక్కిం, డామన్ లలో మాత్రమే అనుమతులున్న సంగతి తెలిసిందే. డేరామండీలో రహస్యంగా నిర్వహిస్తున్న క్యాసినో నిర్వాహకులపైనా కేసులు పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News