: ముద్దులొలికే ఈ అరుదైన కోలాకు మీరు కూడా పేరు పెట్టొచ్చు... వీడియో చూడండి!
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ సన్‌షైన్ జూలో ఓ కోలా జన్మించింది. ఇది అరుదైన తెల్ల కోలా. ఈ జూలో జన్మించిన మొదటి కోలా ఇదే. దీని ఫొటోలను ఎనిమిది నెలల తర్వాత జూ యాజమాన్యం ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. చూడటానికి ఎంతో అందంగా ఉండి, అందర్నీ ఆకర్షిస్తున్న ఈ కోలాకు పేరు పెట్టాలని వారు నెటిజన్లను కోరారు. ప్రస్తుతం దీని రంగు తెలుపుగా ఉన్నా వయసుతో పాటు బూడిద రంగుకు మారుతుందని జూ యాజమాన్యం పేర్కొంది.
కోలాలు అడవిలో ఎక్కువ కాలం జీవించలేవు. ఇతర క్రూర జంతువుల నుంచి వాటికి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ కోలాకు పేరు పెట్టడానికి చాలా మంది నెటిజన్లు ముందుకొస్తున్నారు. వారికి నచ్చిన విధంగా `పర్ల్`, `ప్రకృతి`, `యోగా`, `మార్ష్‌మాలో`, `ఓపల్`, `ప్రీషియస్`, `బియాంకా` వంటి పేర్లను సూచిస్తున్నారు. మీరు కూడా జూ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌పై కామెంట్ చేసి ఏదో ఒక మంచి పేరును సూచించండి మరి!