: నడిరోడ్డు మీద డ్యాన్స్ వేసినందుకు బాలుణ్ని అదుపులోకి తీసుకున్న సౌదీ పోలీసులు... డ్యాన్స్ వీడియో ఇదిగో!
1990ల్లో బాగా ప్రాచుర్యం పొందిన `మకరేనా` పాటకు నడిరోడ్డు మీద స్టెప్పులు వేసి, ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించిన 14 ఏళ్ల బాలుణ్ని సౌదీ అరేబియా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. జెడ్డాలోని 5 లేన్ల ప్రధాన రహదారి మీద డ్యాన్స్ చేసి ఈ బాలుడు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో పబ్లిక్‌లో అసభ్య ప్రవర్తన నేరం కింద అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సౌదీ పోలీసులు తెలిపారు. బాలుడు మైనర్ కావడం వల్ల అతనికి సంబంధించిన వివరాలను బయటికి రానివ్వలేదు. 45 సెకండ్ల వీడియోలో గీతల టీ షర్ట్, షార్ట్ వేసుకుని హెడ్‌ఫోన్‌లో పాటలు వింటూ బాలుడు రోడ్డు మీద స్టెప్పులు వేయడం చూడొచ్చు.