: రజనీకాంత్ పార్టీ గురించి అభిమాని చేసిన ప్రకటన!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో ఊహాగానాలు అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక అభిమాని తమిళనాడు మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే... ప్రస్తుతం తలైవా చేతిలో శంకర్ '2.ఓ', పా రంజిత్ 'కాలా' సినిమాలు ఉండగా... '2.ఓ' షూటింగ్ ఈ నెలాఖరుకు ముగుస్తుంది. ఇది పూర్తికాగానే రజనీ పార్టీ పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే రజనీకి అత్యంత సన్నిహితులు పార్టీ పేరు, పతాకం, చిహ్నం, మేనిఫెస్టో తయారీలో బిజీగా ఉన్నారని ఆయన తెలిపారు.
వచ్చే నెలలో మహానాడు పేరుతో రజనీ భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారని, అందులో ఆయన పార్టీ ప్రకటన, పేరు, పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. ఒకవేళ ఈ బహిరంగ సభ వచ్చే నెలలో సాధ్యం కాని పక్షంలో, ఆయన మళ్లీ అభిమానులతో సమావేశమవుతారని తెలిపారు. ఆ తరువాత డిసెంబరు 12న జన్మదిన వేడుకల సందర్భంగా, అదీ లేదంటే వచ్చే జనవరిలో '2.ఓ' సినిమా విడుదల తరువాత రాజకీయ పార్టీని ప్రకటిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.