: వినాయక చవితికి రానున్న 'లవ' కుమార్ టీజర్!
జూనియర్ ఎన్టీఆర్ `జై లవ కుశ` చిత్రానికి సంబంధించి లవ కుమార్ టీజర్‌ను వినాయక చవితి సందర్భంగా 24వ తేదీ సాయంత్రం 5:40 గం.లకు విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన `జై` ఫస్ట్‌లుక్, `జై` టీజర్, లవ కుమార్ ఫస్ట్‌లుక్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ నేపథ్యంలోనే లవకుమార్ టీజర్‌ను కూడా విడుదల చేసి, సినిమాపై అంచనాలను పెంచేందుకు చిత్రయూనిట్ యత్నిస్తోంది. కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఆయనకు జోడీగా రాశి ఖన్నా, నివేదా థామస్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ తెలుగు తెరకు ప్రతినాయక పాత్రలో పరిచయం కాబోతున్నారు.