mahesh babu: నేను మహేశ్ అభిమానిగా మారిపోయా: మురుగదాస్

షార్ట్స్‌లో చూడండి
మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'స్పైడర్' సినిమా, ఒక పాట మినహా మిగతా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మురుగదాస్ మాట్లాడుతూ, 'అతడు' సినిమా చూసినప్పుడే మహేశ్ బాబుతో తప్పకుండా చేయాలని డిసైడైపోయానని అన్నారు. 'స్పైడర్'... స్పై థ్రిల్లర్ కావడం వలన అందుకు తగిన లుక్స్ వున్న ఆయనను ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పారు.

మహేశ్ బాబు అంకితభావం చూసి తాను ఆశ్చర్యపోయానని... 80 రోజుల పాటు రాత్రి వేళలో షూటింగ్ జరిపినా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. 'స్పైడర్' పాత్రను మహేశ్ లా ఇండియాలో మరో నటుడు చేయలేడని కితాబునిచ్చారు. మహేశ్ బాబుతో తాను ఈ సినిమా చేసిన దగ్గర నుంచి ఆయన అభిమానినైపోయాననీ, ఈ సినిమా తరువాత తమిళనాట కూడా ఆయన స్టార్ హీరోగా మారుతాడని చెప్పుకొచ్చారు . 
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News