naga chaitanya: 'యుద్ధం శరణం'లోను 'బాహుబలి' ప్రస్తావన!

'బాహుబలి' సినిమా ప్రేక్షకుల హృదయాలకు బాగా హత్తుకుపోయింది. అందువలన ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో 'బాహుబలి' ప్రస్తావన తీసుకురావడం జరిగింది. 'మజ్ను' సినిమాలో 'బాహుబలి' సినిమాకి గాను రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా నాని కనిపించాడు. అదే తరహాలో 'యుద్ధం శరణం' సినిమాలో 'బాహుబలి' సినిమాకి సంబంధించి 'డ్రోన్' కెమెరా ఆపరేటర్ గా నాగచైతన్య కనిపించనున్నాడట.

ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ 'బాహుబలి' సెట్లోనే మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఐడియా రాజమౌళి తనయుడు కార్తికేయ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. వచ్చేనెల 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. లావణ్యత్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు.    
naga chaitanya

More Telugu News