: `సైరా నరసింహారెడ్డి` నటీనటులు వీరే!
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా `సైరా నరసింహారెడ్డి`కి సంబంధించిన ఒక్కో విషయం బయటికొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా అధికారికంగా తెలిశాయి. ఇందులో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇతర పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌లు విడుదలైన సంగతి తెలిసిందే!