: కాసపట్లో డాడీకి స్వీట్ గిఫ్ట్: రాంచరణ్
మరికాసేపట్లో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవికి ఓ స్వీట్ గిఫ్ట్ ను పుట్టినరోజు సందర్భంగా అందించనున్నానని మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ వెల్లడించాడు. మధ్యాహ్నం 12.25కు ఆ బహుమతి అందుతుందని కూడా చెప్పాడు. తండ్రికి శుభాకాంక్షలు చెబుతూ, ఓ పరిపూర్ణమైన వ్యక్తికి ఇది పర్ ఫెక్ట్ గిఫ్ట్ అని అభివర్ణించాడు. హీరోలు అఖిల్, నాగచైతన్య తదితరులతో పాటు ఏపీ ఎంపీ నారా లోకేష్ తదితరులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెగాస్టార్ కు పుట్టిన రోజు అభినందనలు తెలిపారు.