: 'అన్నాబెల్లీ క్రియేషన్' చూసి భయంతో అరుస్తూ కుప్పకూలిన యువతి... వీడియో వైరల్!


ఇటీవల విడుదలైన హారర్ మూవీ 'అన్నాబెల్లీ క్రియేషన్'ను చూసిన 20 ఏళ్ల యువతి భయంతో కేకలు పెడుతూ కుప్పకూలిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 'డెయిలీ మెయిల్ డాట్ కో డాట్ యూకే' కథనం ప్రకారం, బ్రెజిల్ లోని తెరిసినా ప్రాంతంలో ఉన్న ఓ సినిమా హాల్ లో లేట్ నైట్ షోకు వెళ్లి, 'ది కన్జూరింగ్' సిరీస్ లో నాలుగో చిత్రమైన 'అన్నాబెల్లీ క్రియేషన్'ను చూసింది. ఆపై అందులో హారర్ సన్నివేశాలకు భయపడింది. అరుస్తూ బయటకు వచ్చింది. ఆమె స్నేహితులు సముదాయించేందుకు ప్రయత్నించినా, వారి వల్ల కాలేదు. హిస్టీరికల్ గా మారిపోయి, తన ముఖంపై తానే కొట్టుకుంటూ, అరుస్తూ కుప్పకూలింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈనెల 11న ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన సదరు యువతి కేకలు పెడుతూ, విపరీతంగా దగ్గుతూ, కింద పడిపోయిన వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News