: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శరణార్థికి ఆశ్రయం ఇచ్చేందుకు స్వీడన్ నిరాకరణ.. 106 ఏళ్ల ఆఫ్ఘానీ మహిళను పంపించే ఏర్పాట్లు!


ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శరణార్థి అయిన 106 ఏళ్ల ఆఫ్ఘాన్ మహిళకు ఆశ్రయం ఇచ్చేందుకు స్వీడన్ నిరాకరించింది. ఆశ్రయం కోసం వృద్ధ మహిళ బిబిహల్ ఉజ్బెకి పెట్టుకున్న దరఖాస్తును స్వీడన్ ప్రభుత్వం తిరస్కరించింది. తాజా రిపోర్టుల ప్రకారం ప్రపంచంలో అత్యంత వృద్ధ శరణార్థి అమెనే. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఆమె ఇరాన్, టర్కీ, గ్రీస్, క్రోయేషియా మీదుగా ప్రయాణించి స్వీడన్ చేరుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉజ్బెకి తన మాతృదేశం ఆఫ్ఘనిస్థాన్ లేదంటే మరో దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది.
భద్రతా పరంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆమె దేశాన్ని విడిచి వెళ్లక తప్పదని మైగ్రేషన్ బోర్డులోని లీగల్ అఫైర్స్ ముఖ్యుడు ఫెడ్రిక్ బీజెర్ పేర్కొన్నారు. తాలిబన్ల ప్రభావిత ప్రాంతమైన ఆఫ్ఘాన్‌లోని కుందుజ్ ప్రాంతం నుంచి ఉజ్బెకి 2015లో పారిపోయి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు దేశాల మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆమె చివరికి స్వీడన్ చేరుకున్నారు. ఆమె పెట్టుకున్న ఆశ్రయ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె దేశం విడిచి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

  • Loading...

More Telugu News