: భూమా బ్రహ్మానందరెడ్డికి 50 వేల మెజార్టీ వస్తుంది: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెలు జాహ్నవి, కరిష్మా ధీమా వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా టీడీపీ తరపున ఇంటింటికీ తిరుగుతూ వారు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీకి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పోటీయే కాదని, భూమా బ్రహ్మానందరెడ్డికి 50 వేల మెజారిటీ వస్తుందని వారు నమ్మకంగా చెప్పారు.

 తాము ఇంటింటికీ ప్రచారం నిమిత్తం వెళ్లిన సందర్భంలో ఓటర్లు చెప్పిన మాటలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. ‘మీరు ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు .. టీడీపీకే ఓట్లు వేస్తాం’ అని ఓటర్లు అంటున్నారని అన్నారు. తమ తండ్రి సుబ్బారెడ్డి ఏనాడు పదవులు ఆశించలేదని, పార్టీ కోసమే ఆయన పనిచేస్తున్నారని, ఆయన కోసమే తాము ప్రచారం చేశామని చెప్పారు.

More Telugu News