sanjay datth: 'ప్రస్థానం' రీమేక్ పై దృష్టి పెట్టిన సంజయ్ దత్?

బాలీవుడ్ సీనియర్ హీరోల్లో సంజయ్ దత్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ ఎన్నో సూపర్ హిట్స్ ను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన 'భూమి' అనే సినిమా చేస్తున్నారు. అలాంటి సంజయ్ దత్ ను ఒక తెలుగు సినిమా ఎంతగానో ఆకట్టుకుంది .. ఆ సినిమా పేరే 'ప్రస్థానం'.

 తెలుగులో సాయికుమార్ .. శర్వానంద్ .. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలుగా దేవ కట్టా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 2010లో వచ్చిన ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది. రాజకీయ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా .. కంటెంట్ పరంగా సంజయ్ దత్ ను బాగా ఆకట్టుకుందట. దాంతో ఆయన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. తానే నిర్మిస్తూ .. నటిస్తాననీ, ఈ విషయంపై దేవ కట్టాతో సంప్రదింపులు జరపనున్నానని సంజయ్ దత్  మీడియా ద్వారా తెలియజేశారు.    
sanjay datth

More Telugu News