: ఎన్నికల అధికారి భన్వర్లాల్పై టీడీపీ ఎంపీల ఫిర్యాదు!
నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో వైసీపీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయమై భన్వర్ లాల్ ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచెల్ కుమార్ జ్యోతికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన్ని కలిశారు. వైసీపీపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై భన్వర్ లాల్ స్పందించడం లేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోని విషయాన్ని అచెల్ కుమార్ జ్యోతి దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అదే, వైసీపీ నేతలు టీడీపీపై చేసిన ఫిర్యాదులకు భన్వర్ లాల్ వెంటనే స్పందించారనే విషయాన్నిఆయనతో టీడీపీ ఎంపీలు చెప్పినట్టు తెలుస్తోంది.