balakrishna: మరింత గ్లామర్ గా కనిపిస్తోన్న నయనతార!

బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ రోజున ఈ సినిమా షూటింగులో నయనతార జాయిన్ అయింది. ఈ సినిమాకి నీరజ కోన స్టైలింగ్ చేస్తోంది.

 నయనతారతో దిగిన సెల్ఫీని ఆమె ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ.. "నయనతారతో కొత్త ప్రయాణం మొదలైంది'' అని చెప్పారు. ఈ ఫోటోలో నయనతార చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆమె ఇంత గ్లామరస్ గా కనిపించింది ఈ స్టిల్ లోనే. వెంకటేశ్ తో 'బాబు బంగారం' చేసిన నయనతార .. బాలకృష్ణ సినిమా చేస్తుండటం .. చిరంజీవితో చేయనుండటం విశేషమే. మొత్తానికి తెలుగులో సీనియర్ హీరోల సినిమా అంటే, ఫస్టు ఆప్షన్ నయనతార అయిపోయిందనే చెప్పాలి.   
balakrishna
nayanatara

More Telugu News