: పళనిస్వామితో పన్నీర్ సెల్వం భేటీ.. శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు పళని అంగీకారం
తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆరునెలల తరువాత పన్నీర్ సెల్వం చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామితో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. శశికళను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తేనే ఇరు వర్గాల విలీనం సాధ్యమని పన్నీర్ సెల్వం చేసిన ప్రతిపాదన పట్ల పళనిస్వామి సానుకూలంగా స్పందించారు. పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై కాసేపట్లో ప్రకటన రానున్నట్లు సమాచారం. మరోవైపు దినకరన్ తన మద్దతుదారులతో భేటీ అయి తాము చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు.