pooja hegde: బన్నీకి పోటీ లేరంటూ పొగిడేసిన పూజా హెగ్డే!

'దువ్వాడ జగన్నాథమ్' సినిమాతో గ్లామర్ పరంగా పూజా హెగ్డే మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా, భారీ వసూళ్లనే రాబట్టిందని చెప్పుకున్నారు. ఈ సినిమా తరువాత పూజా హెగ్డేకి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడంతో, ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాల విషయంలో ఆమె పేరు పరిశీలనలో వున్నట్టుగా తెలుస్తోంది.

 ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ, అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించింది. అల్లు అర్జున్ డాన్స్ లో సూపర్ అనీ .. ఆయన ఆంధ్రా మైఖేల్ జాక్సన్ అని అంది. ఆయనకెవరూ పోటీ లేరంటూ పొగిడేసింది. ఆయనతో కలిసి 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా చేయడం తన అదృష్టమని చెప్పింది. మరోసారి ఆయన జోడీ కట్టాలనుకుంటున్నాననీ, ఈ సారి ఆయన మూవీలో ఛాన్స్ వస్తే స్క్రిప్ట్ కూడా విననని తేల్చి చెప్పేసింది. ఆమె కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.   
pooja hegde

More Telugu News