: ఐశ్వర్య రాయ్ సరసన మాధవన్?
`త్రీ ఇడియట్స్`, `రంగ్ దే బసంతి` సినిమాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న దక్షిణాది నటుడు మాధవన్, త్వరలో అందాల సుందరి ఐశ్వర్య రాయ్‌తో నటించనున్నట్లు తెలుస్తోంది. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తదుపరి చిత్రం `ఫ్యానీ ఖాన్` సినిమాలో ఐశ్వర్యకు జోడీగా మాధవన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం అక్షయ్ ఓబెరాయ్, రాజ్‌కుమార్ రావ్‌లను అనుకున్నా మాధవన్ అయితే బాగుంటుందని చిత్ర వర్గం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. శరీరాకృతి అవహేళనల నేపథ్యంగా రాకేశ్ ఈ చిత్రకథను రాసుకున్నారని, ఈ సినిమా ద్వారా మహిళ శరీరాకృతి గురించి విమర్శలు చేసే వారికి గట్టిగా సమాధానం చెప్పనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.