: ఫోన్ మాట్లాడుతూ బండి నడిపాడు.. రోడ్డుపై అకస్మాత్తుగా ఏర్పడిన గోతిలో పడ్డాడు... వీడియో చూడండి!
నిర్మాణ లోపాల కారణంగా చైనాలోని గువాంగ్జీ ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా ఓ గొయ్యి ఏర్పడింది. ఆ దారిలో ఎప్పటిలాగే బండిపై వెళుతున్న ఓ యువకుడు ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉండటంతో గోతిని గమనించలేదు. దీంతో సరాసరి బండితో సహా గోతిలో పడ్డాడు. 32 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు ఉన్న ఈ గొయ్యి ఏర్పడటాన్ని, యువకుడు అందులో పడటాన్ని వీడియోలో చూడొచ్చు. ఆ యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డట్లు స్థానిక పత్రికలు తెలిపాయి. ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను చాలా మంది లైక్ చేశారు. అంతేకాకుండా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వ్యక్తులకు, స్నేహితులకు ఈ వీడియోను నెటిజన్లు పంపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి మరి!