: స్మార్ట్ ఫోన్ బాగా వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
నేడు స్మార్ట్ ఫోన్ లేని యువతను ఊహించడం రోజురోజుకీ కష్టమవుతోంది. స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ శరీర భాగమైపోయింది. నిద్రకు ముందు, నిద్ర లేచిన వెంటనే చేసే పనులు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన లైకులు, కామెంట్లు, శుభాకాంక్షలు చూసుకోవడమే. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ వ్యసనమైపోయిందని అమెరికాలోని ఇంటరాక్టివ్ మీడియా చెబుతోంది. ఈ సంస్థ చేసిన అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ దూరమైతే పలు వ్యాధులు బారిన పడుతున్నారని తేలింది.
స్మార్ట్ ఫోన్ బాధితులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయారని ఈ అధ్యయనం తెలిపింది. చాలా మంది స్మార్ట్ ఫోన్ బానిసల్లో ‘నోమోఫోబియా’ (స్మార్ట్ ఫోన్ దూరమైతే బెంగ పడడం, విచారంగా ఉండడం) లక్షణాలు కనబడుతున్నాయని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. స్మార్ట్ ఫోన్ దూరమైతే గుండెస్పందనల రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, పలు మానసిక సమస్యలకు గురికావడం జరుగుతోందని ఈ అధ్యయనంలో తేలింది.