teja: ఇక కొత్త వాళ్లతో చేయనంటే చేయను : తేజ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలను ఉత్సాహంతో పరుగులు తీయించిన దర్శకులలో తేజ ఒకరు. లవ్ స్టోరీస్ విషయంలో ఆయన కొత్త ట్రెండ్ ను సృష్టించారు. చాలామంది యువ కథానాయకులను .. కథానాయికలను ఆయన తెలుగు తెరకి పరిచయం చేశారు. కొత్తవాళ్లతో సినిమాలు చేసే దర్శకులలో తేజ ముందుంటారని అనిపించుకున్నారు. అలాంటి తేజ ఇకపై కొత్తవాళ్లతో చేయబోనని చెప్పడం విశేషం.

 కొత్తవాళ్లకి నటన నేర్పిస్తూ .. అనుకున్న అవుట్ పుట్ ను రాబట్టడానికి చాలా సమయం పడుతుందట. ఇక అంత సమయాన్ని తాను వృథా చేసుకోలేననే నిర్ణయానికి తేజ వచ్చారనేది తాజా సమాచారం. మంచి కథలను సిద్ధం చేసుకుంటూ .. క్రేజ్ వున్న హీరో .. హీరోయిన్లతో ముందుకు వెళతానని సన్నిహితులతో ఆయన చెబుతున్నాడు. జనాన్ని థియేటర్స్ కి రప్పించే సత్తావున్న వారితోనే తేజ సినిమాలు చేయాలనుకోవడంలో తప్పులేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.   
Go Back to Shorts
teja

More Telugu News