: విదేశీ న్యాయస్థానాలు భారతీయులకు విడాకులు మంజూరు చేయకూడదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు


భారతీయ దంపతులకు విదేశీ న్యాయస్థానాలు విడాకులు మంజూరు చేయకూడదని బాంబే హైకోర్టు తెలిపింది. దుబాయ్ లో ఉంటున్న ఓ భారతీయుడికి అక్కడి న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడంపై దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు వ్యాఖ్యానిస్తూ, విదేశాల్లో నివసిస్తున్నంత మాత్రాన భారతీయులకు విడాకులు మంజూరు చేసే పరిధి సదరు దేశాల్లోని కోర్టులకు లేదని స్పష్టం చేసింది.

హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న భారతీయ జంటలకు సంబంధించిన కేసులను విచారించే పరిధి విదేశీ కోర్టులకు లేదని చట్టం పేర్కొంటోందని జస్టిస్‌ ఏఎస్‌ ఓకా, జస్టిస్‌ అనుజా ప్రభుదేశాయ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కక్షిదారులిద్దరూ పుట్టుకతోనే భారతీయ హిందువులని, వారికి హిందూ వేదహక్కుల ప్రకారం వివాహం జరిగిందని, వారి వివాహం హిందూ వివాహ చట్టపరిధిలోకి వస్తుందని. అందువల్ల విదేశీ న్యాయస్థానాలకు వారికి విడాకులు మంజూరు చేసే అధికారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News