mahesh babu: పదేళ్ల క్రితమే మహేశ్ తో చేయాలనుకున్నాను: మురుగదాస్

మురుగదాస్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న 'స్పైడర్' .. ఒక పాట మినహా మిగతా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి మురుగదాస్ మాట్లాడుతూ .. మహేశ్ తో ఎలాంటి సినిమా చేయాలని అనుకున్నానో .. అలాంటి సినిమానే చేయగలిగానని అన్నారు.

 మహేశ్ తో సినిమా చేయాలని పదేళ్లుగా అనుకుంటున్నాననీ, అది ఇప్పటికి కుదిరిందని చెప్పారు. ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన ఇంత సమయం పట్టిందని అన్నారు. తెలుగు .. తమిళ భాషలను మహేశ్ అనర్గళంగా మాట్లాడతాడనీ, ఈ రెండు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉండటం వలన మహేశ్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ కథపై కూర్చున్నానని చెప్పారు. మొత్తానికి మహేశ్ తో చేయాలనే కోరిక నెరవేరిందనీ .. ఇక ఆయనతో కలిసి హిట్ కొట్టడమే మిగిలిందని చెప్పుకొచ్చారు.   
mahesh babu
rakul

More Telugu News