: కీలకమైన మిడిల్ ఆర్డర్ ప్లాన్ ఇదే: విరాట్ కోహ్లీ


వరల్డ్ కప్ క్రికెట్ మరో 2 సంవత్సరాల సమయమే ఉండటంతో, ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో సన్నద్దం కావాల్సిన అవసరం ఉందని, నేడు శ్రీలంకతో జరిగే తొలి వన్డే నుంచి తమ వ్యూహాలను అమలు చేయనున్నామని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఓపెనర్ల తరువాత తాను దిగుతానని చెప్పిన కీలకమైన మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడని తెలిపాడు.

రెండో స్థానం కోసం కేదార్ జాదవ్, మనీష్ పాండేలలో ఒకరు ఉంటారని, ఆ స్థానం కోసం వీరిద్దరి మధ్యా గట్టి పోటీ ఉందని అన్నాడు. ఆపై బ్యాటింగ్ లో ధోనీ ఉంటాడని వెల్లడించాడు. మనీష్, కేదార్ లు ఇద్దరూ మంచి ఆటగాళ్లేనని, భవిష్యత్తులో ఏళ్ల పాటు జట్టులో కొనసాగగల సత్తా ఉన్నవారేనని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ లో స్థానాలపై తాను ఎవరికీ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని రోహిత్ శర్మ, అజింక్య రహానే, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉందని చెప్పాడు.

  • Loading...

More Telugu News