: మేము విభిన్న మతాలకు చెందిన వాళ్లం... ఈ నెల 23నే మా రిజిస్టర్‌ మ్యారేజ్‌: హీరోయిన్ ప్రియమణి

హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఈ నెల‌ 23న తన ప్రియుడు ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకోనున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్రియ‌మ‌ణి ఆడంబ‌రంగా కాకుండా రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోనుంద‌ట‌. తాజాగా త‌న పెళ్లి వార్త‌ల‌పై స్పందించిన ప్రియ‌మ‌ణి.. తాను రిజిస్ట‌ర్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నానన్న విష‌యాన్ని చెప్పింది. త‌న‌ది ఓ మతం అయితే త‌న ప్రియుడిది మ‌రో మ‌తం అని తెలిపింది. అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటున్నామ‌ని వివ‌రించింది.

తామిద్ద‌రం ప‌ర‌స్ప‌ర‌ అంగీకారంతో రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్రియమణి చెప్పింది. అలాగే, పెళ్ల‌యిన త‌రువాత కూడా తాను న‌టిస్తూనే ఉంటాన‌ని తెలిపింది. పెళ్ల‌యిన రెండు రోజుల‌కే తాను షూటింగ్‌కు వెళ‌తాన‌ని, త‌న చేతిలో వరుసగా రెండు సినిమాలు ఉన్నాయని చెప్పింది.  

More Telugu News