: స‌ల్మాన్ ఖాన్ `బిగ్‌బాస్‌ 11` టీజ‌ర్ విడుద‌ల‌... సెల‌బ్రిటీలు, సామాన్యుల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న గేమ్‌!

`బిగ్‌బాస్ 10` రియాలిటీ షో‌లోకి సామాన్యుల‌కు కూడా ప్ర‌వేశం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్‌తోనే `బిగ్‌బాస్ 11` ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మొద‌టి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్‌లో ఇంటి ప‌క్కన‌ నివ‌సించే వాళ్ల‌తో ఎలా మెల‌గాల‌నే విష‌యాన్ని వ్యాఖ్యాత‌ స‌ల్మాన్ ఖాన్ వివ‌రిస్తున్న‌ట్లు చూపించారు. `ప‌డోసీ (ప‌క్కింటివాళ్లు)` అనే అంశం ఆధారంగా ఈసారి బిగ్‌బాస్ ఇంట్లో సెల‌బ్రిటీలు, సామాన్యులు ప‌క్క‌ప‌క్క ఇళ్ల‌లో నివ‌సించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ టీజ‌ర్‌లో ముఖ్యంగా  స‌ల్మాన్ త‌న పెళ్లి గురించి వేసిన జోక్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. అక్టోబ‌ర్ 1 నుంచి ఈ కార్య‌క్ర‌మం `క‌ల‌ర్స్‌` ఛాన‌ల్‌లో ప్రసారం కానుంది. ఇందులో పాల్గొన‌బోయే వారి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు.

More Telugu News