: చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో... రేపు లడక్ కు వెళ్లనున్న భారత ఆర్మీ చీఫ్
భారత్, చైనా మధ్య రాజుకున్న డోక్లాం వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా చైనా ప్రవర్తిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 15న లడక్ ప్రాంతంలోని పాంగాంగ్ సరస్సు వద్దకు చైనా ఆర్మీ ప్రవేశించడం, ఇరు దేశాల ఆర్మీ రాళ్లదాడి చేసుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో రేపు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఆ ప్రాంతంలో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. చైనా, భారత్ సరిహద్దులో భద్రతా బలగాల సంసిద్ధతను ఆయన పరిశీలించి, ఉన్నతాధికారులతో కీలక విషయాలపై చర్చిస్తారు.