gretandhra: సరైన కథల కోసమే వెయిటింగ్: అమలా పాల్

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అమలా పాల్ కి మంచి గుర్తింపు వుంది. అయితే, కొత్త కథానాయికల పోటీ కారణంగా తెలుగు నుంచి ఆమెకి అవకాశాలు వెళ్లడం లేదు. తమిళంలో తనకి గల పరిచయాల కారణంగా కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతోంది. అయితే ఆ కొన్ని అవకాశాలతో కెరియర్ ను నెట్టుకురావడం కష్టమని భావించిన ఆమె, మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది.

 అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి ఓ మూడు సినిమాలు చేతికి వచ్చాయి. ఇక తెలుగు నుంచి కూడా తనకి అవకాశాలు బాగానే వస్తున్నాయని ఈ సుందరి చెబుతుండటం విశేషం. చాలామంది దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారనీ .. అయితే మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నానని అంటోంది. తెలుగులో పట్టించుకునే నాథుడు లేకపోయినా ఈ గొప్పలు ఎందుకనే గుసగుసలు వినిపిస్తున్నాయి.   
gretandhra

More Telugu News