chiranjeevi: రాజమౌళి చేతుల మీదుగా 'ఉయ్యాలవాడ' మోషన్ పోస్టర్ రిలీజ్!

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి 151వ చిత్రంగా చేస్తోన్న 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.

 ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ రిలీజ్ వుండనున్నట్టు సమాచారం. మోషన్ పోస్టర్ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ ను ఘనంగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ ఒక కీలకమైన పాత్రలో నటించనుండగా, నయనతార కథానాయికగా కనిపించనుంది.  
Go Back to Shorts
chiranjeevi

More Telugu News