: కొత్త 50 రూపాయల నోటు వచ్చేస్తుంది... ప్రకటించిన ఆర్బీఐ!


నోట్ల రద్దు అనంతరం కొత్త 2000 రూపాయల నోటుతో పాటు 500 రూపాయల నోటును ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త 50 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అధికారికంగా ప్రకటించింది. భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథంతో పాటు స్వచ్ఛ భారత్‌ లోగోను ఈ నోటు వెనుక భాగంలో ముద్రించారు.

ఇక నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫొటోతో పాటు దేవనాగరి లిపిలో 50 రూపాయలను సూచించే సంఖ్య, ఆర్బీఐ అని మైక్రోలెటర్స్‌, ఇండియా అన్న పదాలు రాసి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. కుడివైపు భారత జాతీయ చిహ్నం, ఎలక్ట్రోటైప్‌ వాటర్‌ మార్క్‌, ఆరోహణ క్రమంలో నెంబరు ప్యానెల్‌ వుంటాయి. ఈ నోటు 66 ఎంఎం వెడల్పు, 135 ఎంఎం పొడవు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఈ నోటు ఫ్లోరొసెంట్ బ్లూ కలర్ లో ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. అలాగే కొత్త నోటుతో పాటు, పాత నోటు కూడా చలామణిలో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 

  • Loading...

More Telugu News