: దర్శకుడు చలపతి, హీరో సృజన్‌ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
దర్శకుడు చలపతి, హీరో సృజన్ తనపై రెండు సార్లు అత్యాచారయత్నం చేశారంటూ ఈ నెల 15న ఓ వర్ధమాన నటి విజయవాడలోని పటమట పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శకుడు చలపతి, హీరో సృజన్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో వేగవంతంగా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని హీరో సృజన్, దర్శకుడు చలపతి ఆ నటిని ఒక కారులో తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు.