: వైసీపీ డబ్బులు పంచుతోంది.. చర్యలు తీసుకోండి!: ఈసీకి టీడీపీ విజ్ఞప్తి
నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతుండడంతో పలువురు నేతలు ఓటర్లను ప్రలోభపెడుతూ డబ్బులు పంచుతున్న ఘటనలు బయటకు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఆరోపిస్తూ ఈ రోజు ఎన్నికల కమిషన్‌కి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఓటర్లకు నగదు పంచుతూ వైసీపీ కార్యకర్తలు పట్టుబడ్డారని ఈసీ దృష్టికి తీసుకొచ్చింది. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదును తీసుకున్న సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.