shraddha das: అవకాశాల కోసం ఎప్పుడూ దిగజారలేదు : శ్రద్ధా దాస్

తెలుగు తెరకు కొత్త గ్లామర్ ను పరిచయం చేసిన కథానాయికలలో శ్రద్ధా దాస్ ఒకరు. 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా దాస్, ఆ తరువాత వివిధ భాషల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తోంది. అలా దాదాపు పదేళ్లకు పైగా ఆమె తన కెరియర్ ను నెట్టుకొస్తోంది. ఇందుకు కారణం కేవలం తన గ్లామర్ మాత్రమే కాదనీ .. యాక్టింగ్ స్కిల్స్ కూడానని ఆమె చెప్పింది.

 కెరియర్ ఆరంభంలో పడక గదికి వస్తే అవకాశం ఇస్తామనే వాళ్లు తనకి కూడా తారసపడ్డారని అంది. అందుకు తాను అంగీకరించకపోవడం వలన కొన్ని సినిమాల నుంచి తొలగించారని చెప్పింది. ఈ కారణంగా తాను కొన్ని సినిమాల నుంచి తప్పుకున్న సందర్భాలు .. తాను చేసిన పాత్రల నిడివిని తగ్గించిన సందర్భాలు ఉన్నాయని అంది. ఇలాంటివాటినన్నింటిని సహనంతో తట్టుకుని నిలబడ్డానే గానీ, ఏనాడూ అవకాశాల కోసం దిగజారలేదని స్పష్టం చేసింది.  
shraddha das

More Telugu News