srinivasa reddy: రొమాంటిక్ హీరోగా మారుతోన్న టాప్ కమెడియన్!

తెలుగు తెరపై కామెడీతో సందడి చేసే హాస్య నటులలో శ్రీనివాస రెడ్డి ఒకరు. చాలాకాలం నుంచి ఆయన తనదైన హాస్యాన్ని పండిస్తూ వస్తున్నారు. మంచి టైమింగ్ వున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన .. 'గీతాంజలి' చిత్రంలో కీలకమైన పాత్రను పోషించి మెప్పించారు. ఇక 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలో కథానాయకుడు అనిపించుకున్నారు. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆనందో బ్రహ్మ' చిత్రంలోనూ ఆయనది ముఖ్యమైన పాత్రే.

 అలాంటి శ్రీనివాస రెడ్డి త్వరలో రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు జె.బి.మను ఓ రొమాంటిక్ మూవీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన శ్రీనివాస రెడ్డిని తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్ ను ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోందనీ .. అక్టోబర్లో సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నామని దర్శకుడు చెప్పాడు.    
srinivasa reddy

More Telugu News