: వైసీపీ వికృత చేష్ట‌లు చేస్తోంది.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: అచ్చెన్నాయుడు


నంద్యాల ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో టీడీపీ, వైసీపీల మ‌ధ్య వాగ్యుద్ధం మ‌రింత పెరిగింది. ఈ రోజు టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైసీపీ కుట్ర‌లు చేస్తోంద‌ని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా స్పందించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడు తాము వైసీపీ చేస్తోన్న‌ కుట్ర‌ల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. ఎన్నిక‌లు వాయిదా వేయించాల‌ని వైసీపీ చేస్తోన్న‌ కుట్రలు స‌రికావ‌ని అన్నారు. ఉప‌ ఎన్నిక నేప‌థ్యంలో వైసీపీ వికృత చేష్ట‌లు చేస్తోందని అన్నారు. కాగా, మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్ రెడ్డి.. చంద్రబాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేర‌తారని స్ప‌ష్టం చేశారు.  

  • Loading...

More Telugu News