: మహేశ్‌బాబు ‘స్పైడర్’ ప్రచార కార్యక్రమానికి అతిథిగా వస్తున్న రజనీ కాంత్!
నటుడు మహేశ్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న స్పైడర్ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘స్పైడర్’ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకున్న లైకా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో త్వరలోనే చెన్నైలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న రోబో 2.0 సినిమాలో సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నాడు.
దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ స్పైడర్ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీకాంత్‌తో పాటు దర్శకుడు శంకర్ ను తీసుకొస్తుందట. ఈ విషయంపై స్పైడర్ సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తమిళ హీరో భరత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.