: బైక్‌పై వచ్చి.. యువతిని కాల్చి చంపిన యువకులు!
బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ అమ్మాయితో ఏదో మాట్లాడి అనంతరం ఆమెను కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షాహిబాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, ఈ ఘటనపై ఆరా తీశారు. సదరు బాధితురాలు ఉత్తరాఖండ్‌కు చెందిన యువతిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయితో కాసేపు మాట్లాడి ఈ ఘటనకు పాల్పడ్డట్లు తమకు తెలిసిందని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ప్రస్తుతం బాధితురాలి బంధువులను సంప్రదిస్తున్నామని మీడియాకు తెలిపారు.