: 'సుత్తి సైకో'కు ఉరి శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించిన నెల్లూరు కోర్టు
సుత్తి సైకో కేసులో నెల్లూరు నాల్గో అదనపు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు వెంకటేశ్వర్లుకు కోర్టు ఉరిశిక్షను విధించింది. 2016లో హరినాథపురంలో ఆడిటర్ భార్య ప్రభావతి తో పాటు, పూజారి దంపతులను వెంకటేశ్వర్లు సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో, కోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. సైకో వెంకటేశ్వర్లుకు ఉరిశిక్షను ఖరారు చేసింది.