: వరదల్లో చిక్కుకున్న పర్యాటకులకు గజరాజుల సాయం... వీడియో చూడండి
వరదల కారణంగా నేపాల్‌లోని సఫారీ పార్కులో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి అధికారులు గజరాజుల సాయం తీసుకున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రాప్తీ నది ఒప్పొంగింది. ఆ నది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో అక్కడి సౌరాహా ప్రాంతంలోని చిత్వాన్ జాతీయ పార్కులో ఖడ్గమృగాలను చూడటానికి వచ్చిన 300 మందికి పైగా విదేశీ పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. వీరిని ఏనుగుల సాయంతో నది దాటించి పక్కనే ఉన్న భరత్‌పూర్ ప్రాంతానికి తరలించారు. వరదల కారణంగా ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.