: ఈసీ ఆ పని చేస్తే.. నంద్యాలలో దిమ్మతిరిగే ఫలితం వస్తుంది: రఘువీరా డిమాండ్


నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేసిందని మండిపడ్డారు. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని తెలిపారు.

కుల దూషణలతో ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహిస్తోందని... ఈసీ సక్రమంగా విధులు నిర్వహిస్తే నంద్యాలలో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News