: 'పెళ్లొద్దు...చదువుకుంటా' అన్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యా యత్నం చేసిన బాలిక!

‘అమ్మా! అప్పుడే నాకు పెళ్లి వద్దు. నేను బాగా చదువుకుంటా. పదో తరగతే కదా చదువుతున్నాను. బాగా చదువుకుంటాను, మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను, ఆ తరువాత పెళ్లి గురించి ఆలోచిద్దాం’ అంటూ ఆలోచనల్లో క్లారిటీ చూపించినా ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. పెళ్లి చేసేస్తాం అనడంతో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం విరూపాక్షినగర్ కు చెందిన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ద్రావకం తాగిన బాలికను గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించడంతో బాలికకు చికిత్స చేసిన వైద్యులు సఖి కౌన్సెలింగ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

దీంతో కౌన్సిలర్‌ ఉమాదేవి బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న తల్లిని బాల్యవివాహం నేరమని, ఇంకోసారి బలవంతం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించగా, తమ బంధువుల అమ్మాయి కోసం సంబంధం వచ్చిందని, మాటల సందర్భంలో ఏదో సరదాగా ఓ మాట అన్నామని ఆమె తెలిపారు. ఆమాత్రానికే ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె చెప్పారు. అయితే తల్లి మాటలను బాలిక ఖండించింది. 

More Telugu News