: చంద్రబాబుగారి నైజం గురించి ఎన్టీ రామారావు గారు ఎంత చక్కగా చెప్పారంటే...!: జగన్
చంద్రబాబునాయుడు గురించి ఆయన మామ ఎన్టీఆర్ నాడు విమర్శించిన తీరు ఏ విధంగా ఉందనే విషయాన్ని వైసీపీ అధినేత జగన్ ప్రస్తావించారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు జంక్షన్ లో రోడ్ షోలో జగన్ మాట్లాడుతూ, ‘ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడుగారి నైజం గురించినాడు ఎంత చక్కగా చెప్పారంటే.. ‘జామాతా దశమ గ్రహం’ అన్నారు. అసలు తొమ్మిది గ్రహాలు ఉంటాయి, ఈయన పదోగ్రహం అని అర్థం... ‘పదవి కోసం, అధికారం కోసం ఎందుకిలా గడ్డి తింటున్నావు?’ అని, ‘ నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. తండ్రి లాంటి నన్ను ఎలా మోసం చేశాడో చూడండి’ అని చంద్రబాబుని ఎన్టీ రామారావుగారు నాడు అన్నారు’ అని జగన్ చెప్పుకొచ్చారు.