: రైల్లోంచి ఒక్కడు అరుస్తూ పరిగెత్తాడు... ఆ వెంటే వందల మంది పరిగెత్తారు... ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.... వీడియో చూడండి!
చైనాలోని షెంజెన్ రైల్వే స్టేషన్‌లో ఓ వింత సంఘటన జరిగింది. స్టేషన్‌లో బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న రైల్లో అందరూ ఎక్కారు. ఉన్నట్టుండి ఓ యువకుడు గట్టిగా అరుచుకుంటూ బయటికి పరిగెత్తాడు. అంతే... రైల్లో ఉన్న మిగతా వాళ్లంతా అతని వెనక భయంతో పరుగులు తీశారు. వాళ్లు మాత్రమే కాదు... స్టేషన్లో ఫ్లాట్‌ఫాం మీద ఉన్న వాళ్లు, మిగతా కంపార్ట్‌మెంట్లలో ప్రయాణికులు కూడా ఏమైందోనని పరుగులు తీశారు. తర్వాత ఏం జరిగిందని ప్రశ్నిస్తే ఎవ్వరి దగ్గర సరైన సమాధానం లేదు. అందరితో పాటు మేమూ వెళ్లాం అని చెప్పారు. ఆ యువకుడు ఎందుకు పరిగెత్తాడో కూడా ఎవరికీ తెలియదు. రైలు బోగీలో ఏదైనా ఉందేమోనని పోలీసులు వెతికారు. వారికి ఏం దొరకలేదు. ప్రయాణికులంతా యువకుడి వెనకాల పరిగెడుతున్న వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఫుటేజీ ఆధారంగా యువకుణ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.