: శ్రీలంకలో ప్రియురాలితో కలసి సేదదీరుతున్న విరాట్ కోహ్లీ!

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆనందంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సేదదీరుతున్నాడు. షారూఖ్ తో నటించిన జబ్ హ్యారీ మెట్ సెజెల్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో అనుష్క నిరాశచెందుతోంది. టెస్టు సిరీస్ విజయంతో కోహ్లీ పట్టరాని ఆనందంలో ఉన్నాడు. ప్రియురాలి బాధను పంచుకోవాలనుకున్న కోహ్లీ...శ్రీలంకలో వన్డే సిరీస్ కు విరామం ఉండడంతో ప్రియురాలిని రప్పించుకున్నాడు. ఈ విషయం గోప్యంగా ఉంచినప్పటికీ, కోహ్లీ బస చేసిన హోటల్ లో అభిమానులతో కలిసి దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఫోటోల్లో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఉండడం విశేషం.  

More Telugu News